Breaking News

టీడీపీకి మనుగడ లేదు..కాంగ్రెస్ తో పోటీ లేదు..

harish

వరంగల్ : తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి మనుగడ లేదని.. కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. వరంగల్ లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ లో మంత్రి హరీష్ రావు మాట్లాడారు. హైదరాబాద్ లో చెల్లని కిషన్ రెడ్డి వరంగల్ లో ఎలా చెల్లుతాడని ప్రశ్నించారు. వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ది గెలుపు ఖాయమని ఆయన అన్నారు. వరంగల్ ప్రజలు ఈసారి సైతం ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే షాక్ ఇస్తారని హరీష్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేస్తామన్నారు. వరంగల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పై హామీలు గుప్పించారు.
వరంగల్ ను ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతామని అన్నారు.వరంగల్ కు వచ్చే మూడేల్లలో రూ.900 కోట్లు మంజూరు చేస్తామని తెలిపారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేత సీఎం కేసీఆర్ అని అన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *