
హైదరాబాద్ : ప్రస్తుత ఏపీలో తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్మాయం వైసీపీనే అని.. చంద్రబాబు పాలనలో అవినీతి అక్రమాలు, మోసపూరిత వాగ్ధానాలు చేస్తున్న చంద్రబాబును గద్దె దించడమే ధ్యేయంగా పోరాడుతానని కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన బొత్స సత్యనారాయణ అన్నారు. హైదరాబాద్ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
తాను ఎమ్మెల్సీ పదవి కోసం వైసీపీలో చేరుతున్నాన్న విమర్శలను ఖండించారు. తెలంగాణ ప్రభుత్వంతో రాజీపడి ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పై తనకు కోపం లేదని.. ఆ పార్టీ నుంచే తాను ఎదగానని.. కాంగ్రెస్ నాకు అన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.ఏపీ రాజధాని 20 ఏళ్ల కడతానంటున్న చంద్రబాబును 20 ఏళ్లు ప్రజలు భరించాలా అని ప్రశ్నించారు.