
తెలంగాణలో టీడీపీ లాగే కాంగ్రెస్ కూడా ఖాళీ అయిటట్టే కనిపిస్తోంది.. తెలంగాణలో టీఆర్ఎస్ అన్ని జిల్లాల్లో బలంగా ఉంది. ఒక్క నల్గొండలో తప్ప.. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ హవానే నడుస్తోంది. అందుకే దీనిపై దృష్టి పెట్టిన కేసీఆర్ అనుకున్నది సాధించారు. నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు గాలం వేసి టీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అని కూడా చూడకుండా కేసీఆర్ కాంగ్రెస్ ను కకావికలం చేసేందుకు కేసీఆర్ రెడీ అయినట్టు కనిపిస్తోంది.. నల్గొండ కాంగ్రెస్ లీడర్లు కోమటిరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి లు ఇప్పటికే టీఆర్ఎస్ లో చేరేందుకు సీఎం కేసీఆర్ భేటి అయ్యారు. ఇందులో గుత్తాతో పాటు పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్, అతడి సోదరుడు మాజీ మంత్రి వినోద్, ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, రవీంద్రనాయక్ లు సీఎం కేసీఆర్ ను సోమవారం రాత్రి కలిసినట్టు సమాచారం. వీరందరూ కూడా కాంగ్రెస్, సీపీఐల కు బై చెప్పి టీఆర్ఎస్ లో 15న చేరుతామని ప్రకటించారు.. ఇక నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి సైతం కారెక్కనున్నారని ప్రచారం జరిగినా ఆయనపై ఉత్తమ్, జానారెడ్డి లు మాట్లాడి ఒప్పించడంతో తాను టీఆర్ఎస్ లో చేరడం లేదని పీసీసీలో ప్రకటించారు.