
హైదరాబాద్ , ప్రతినిధి : తెలంగాణ శాసనసభ నుంచి టీడీపీ ని గెంటేయడంతో టీడీపీ బ్లేమ్ గేమ్ కు తెరతీసింది. తెలంగాణ టీడీపీ నేతలు ఈరోజు గవర్నర్ ను కలిసి టీఆర్ఎస్ దమననీతిని, అసెంబ్లీలో పిడుగుద్దులను, తమను సస్పెండ్ చేసిన తీరుపై ఫిర్యాదు చేశారు. అలాగే నిన్న అసెంబ్లీ ఎదుట నల్లగుడ్డలతో ఆందోళన చేశారు. ఇప్పుడు అదే నిరసనల పర్వంతో టీఆర్ఎస్ ను బ్లేమ్ చేయాలని నిర్ణయించారు.
అందులో భాగంగానే ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు. ఢిల్లీలో రాష్ట్రపతిని, ప్రధాన ఎన్నికల కమిషనర్ ను కలిసి టీఆర్ఎస్ తీరును, టీడీపీ నాయకుల పార్టీ ఫిరాయింపుల వరకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. అలాగే కేంద్రంలోని మంత్రులను కలిసి ఫిర్యాదుచేయాలని నిర్ణయించారు. దీని ద్వారా టీఆర్ఎస్ ను ఢిల్లీ స్థాయిలో బ్లేమ్ చేయాలని నిర్ణయించారు. ఇలాగైన తమ గోడు తెలుస్తుందని విన్నవించారు.