టీఎస్ ఐఐసీ ప్రాజెక్టులు-2018 క్యాలెండ‌ర్‌ను విడుద‌ల చేసిన టీఎస్ఐఐసీ చైర్మ‌న్ గ్యాద‌రి బాల‌మ‌ల్లు

2018 కార్య‌సాధ‌న సంవ‌త్స‌రం
కొత్త ఏడాదిలో మెగా ప్రాజెక్టుల కార్య‌రూపం
– టీఎస్ ఐఐసీ చైర్మ‌న్ గ్యాద‌రి బాల‌మ‌ల్లు

టీఎస్ ఐఐసీ ప్రాజెక్టులు-2018 క్యాలెండ‌ర్‌ను విడుద‌ల చేసిన టీఎస్ఐఐసీ చైర్మ‌న్

బాల‌మ‌ల్లు, ఎమ్మెల్సీలు క‌ర్నె ప్ర‌భాక‌ర్‌, శంభీపూర్ రాజు,
టీఆర్‌ఎస్ నేత మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టీఐఎఫ్ అధ్య‌క్షుడు కే సుధీర్‌రెడ్డి

(హైద‌రాబాద్ – జ‌న‌వ‌రి 12 )

పారిశ్రామిక ప్రాజెక్టుల కార్య‌చ‌ర‌ణ ప్ర‌ణాళిక అమ‌లుకు 2018 అత్యంత కీల‌క సంవ‌త్స‌ర‌మ‌ని టీఎస్
ఐఐసీ చైర్మ‌న్ గ్యాద‌రి బాల‌మ‌ల్లు అన్నారు. కొత్త ఏడాదిలో కొన్ని మెగా పారిశ్రామిక ప్రాజెక్టులను
కార్య‌రూపంలోకి తేవాల‌న్న‌ది త‌మ ల‌క్ష్య‌మ‌ని చెప్పారు. శుక్ర‌వారం ప‌రిశ్ర‌మ భ‌వ‌న్‌లో టీఎస్ ఐఐసీ
ప్రాజెక్టులపై సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు, రంగారెడ్డి జిల్లా మీడియా అక్రిడిటేష‌న్ క‌మిటీ మెంబ‌ర్ బియ్య‌ని సురేష్
రూపొందించిన 2018 -క్యాలెండ‌ర్‌ను టీఎస్ ఐఐసీ చైర్మ‌న్ గ్యాద‌రి బాల‌మ‌ల్లు, ఎమ్మెల్సీలు క‌ర్నె
ప్ర‌భాక‌ర్‌, శంభీపూర్ రాజు, టీఆర్ ఎస్ సీనియ‌ర్ నేత మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ పారిశ్రామిక‌వేత్త‌ల
సంఘం అధ్య‌క్షుడు కే సుధీర్‌రెడ్డి విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా టీఎస్ ఐఐసీ చైర్మ‌న్
మాట్లాడుతూ..నీటిపారుద‌ల‌, విద్యుత్‌, అభివ్ర‌ద్ధి, సంక్షేమ రంగాల‌తో పాటు పారిశ్రామికాభివ్ర‌ద్ధికి
ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్య‌త ఇస్తున్నార‌న్నారు. టీఎస్‌-ఐపాస్ ద్వారా పారిశ్రామికంగా తెలంగాణ
రాష్ట్రం దేశంలో నెంబ‌ర్ వ‌న్‌గా దూసుకుపోతోంద‌న్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆలోచ‌న‌ల‌కు
అనుగూనంగా ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ అహ‌ర్నిష‌లు క్ర‌షి చేస్తున్నందునే అద్భుత ఫ‌లితాలు

వ‌స్తున్నాయ‌ని చెప్పారు. పారిశ్రామికంగా ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌లకు త‌గ్గ‌ట్టుగా ల‌క్ష్య‌సాధ‌న దిశ‌గా
తెలంగాణ పారిశ్రామిక మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌నా సంస్థ‌(టీఎస్ ఐఐసీ) కీల‌క‌పాత్ర పోషిస్తోంద‌ని
బాల‌మ‌ల్లు తెలిపారు. మెగా ప్రాజెక్టులైన ముచ్చ‌ర్ల ఫార్మాసిటీ, జ‌హీరాబాద్ నీమ్జ్‌, సుల్తాన్‌పూర్ మెడిక‌ల్
డివైజ్ పార్కు, వ‌రంగ‌ల్ కాక‌తీయ టెక్స్ టైల్స్ పార్కు, దండుమ‌ల్కాపూర్ ఎంఎస్ ఎంఈ -టీఐఎఫ్‌- గ్రీన్
ఇండ‌స్ట్రియ‌ల్ పార్కును ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తుంద‌న్నారు. వీటిని నిర్ణీత గ‌డువులోగా
ప్రారంభించేలా కొత్త ఏడాదిలో భూ సేక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరిన మెగా ప్రాజెక్టులు, ఇండ‌స్ట్రియ‌ల్ పార్కులపై
ప్ర‌త్యేక ద్ర‌ష్టి సారిస్తామ‌న్నారు. ఈ మెగా ప్రాజెక్టులు పూర్త‌యితే తెలంగాణ పారిశ్రామికాభివ్ర‌ద్ధి మ‌రింత
పుంజుకుంటుంద‌ని చెప్పారు. ముఖ్యంగా ఫార్మా, టెక్స్ టైల్స్ రంగాల్లో తెలంగాణ‌కు ప్ర‌పంచ‌స్థాయి కంపెనీల
ద్వారా భారీఎత్తున పెట్టుబ‌డులు వ‌స్తాయ‌న్నారు. నూత‌న సంవ‌త్స‌రంలో బుద్వేల్ ఐటీ పార్కు
అభివ్ర‌ద్ధితో పాటు జిల్లాల్లో టీ ట‌వ‌ర్లు, టీ హ‌బ్‌ల నిర్మాణం, కొత్త పారిశ్రామిక‌వాడ‌ల ఏర్పాటు
చేయ‌నున్న‌ట్లు టీఎస్ ఐఐసీ చైర్మ‌న్ బాల‌మ‌ల్లు తెలిపారు. క్యాలెండ‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో
టీఐఎఫ్ కార్య‌వ‌ర్గ స‌భ్యుడు దాచేప‌ల్లి వినోద్‌, సంయుక్త కార్య‌ద‌ర్శి జి.హ‌రినాధ్‌, చిన్న‌ప‌రిశ్ర‌మ‌ల
య‌జ‌మానుల సంఘం ప్ర‌తినిధి రాంరెడ్డి, కాప్రా చిన్న ప‌రిశ్ర‌మ‌ల య‌జ‌మానుల సంఘం అధ్య‌క్ష‌,
కార్య‌ద‌ర్శులు బాల‌న‌ర్సింహాగౌడ్‌, ఎన్‌.శ్రీనివాస్‌, టీఆర్ ఎస్వీ నేత ధ‌ర్మేంద‌ర్‌రెడ్డి, టీఆర్ ఎస్
నాయ‌కులు నాగ‌రాజు, పాండు ముదిరాజ్‌, కొండ‌ల్ రెడ్డి, దేశ‌మోల్ల ఆంజ‌నేయులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *