Breaking News

టీఎస్ ఐఐసీ ఉద్యోగుల 2018 క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు

టీఎస్ ఐఐసీ ఉద్యోగుల 2018 క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు

టీఎస్ ఐఐసీ ఉద్యోగుల 2018 క్యాలెండర్, డైరీని బుధవారం పరిశ్రమ భవన్ లో టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త సంవత్సరం లో టీఎస్ ఐఐసీ లక్ష్యసాధన లో ముందు ఉండాలన్నారు. గతేడాది వివిధ ప్రాజెక్టులకు ప్రారంభించిన భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు, జహీరాబాద్ నీమ్జ్, సుల్తాన్పూర్ మెడికల్ డివైజ్ పార్కు, ఫుడ్ పార్కులు నూతన సంవత్సరంలో ప్రారంభించడానికి చర్యలు వేగవంతం చేయాలని బాలమల్లు సూచించారు. ఈ ఏడాది బుద్వేల్ ఐటీ పార్కు, కరీంనగర్, ఖమ్మం తో పాటు తెలంగాణ లోని ప్రధాన నగరాల్లో ఐటీ హబ్ అండ్ టవర్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు. అన్ని జిల్లాల్లో కొత్త పారిశ్రామిక వాడల ఏర్పాటుకు అనువైన భూములను ఎంపిక చేయాలని టీఎస్ ఐఐసీ అధికారులకు, ఉద్యోగులను ఆదేశించారు.  ముఖ్యమంత్రి కేసీఆర్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆలోచనలకు అనుగూనంగా వేగవంతమైన పారిశ్రామిక ప్రగతితో బంగారు తెలంగాణ నిర్మాణంలో పాలుపంచుకోవాలని టీఎస్ ఐఐసీ చైర్మన్ కోరారు.

ఈ కార్యక్రమంలో టీఎస్ ఐఐసీ ఎండి ఈవీ నర్సింహారెడ్డి, నీమ్జ్ సిఇఓ మధుసూదన్, టీఎస్ ఐఐసీ సీఈ లక్ష్మీకాంత్ రెడ్డి, టీఎస్ ఐఐసి ఉద్యోగుల సంఘం నాయకులు విఠల్, టీఎస్ ఐఐసీ జోనల్ మేనేజర్లు, జనరల్ మేనేజర్లు,సిబ్బంది   పాల్గొన్నారు.

bala mallu 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *