
ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియన్ గోల్డెన్ జూబిలీ ఉత్సవం హైద్రాబాద్ చాప్టర్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, ప్రత్యేక అతిధిగా ఎమ్మెల్సీ రామచంద్రా రావు.
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కామెంట్స్…
టీఎస్ఐపాస్ తో తెలంగాణ కు అనేక కంపెనీలు, పరిశ్రమలు వస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వ ఇండస్ట్రియల్ పాలసిని దేశవ్యాప్తంగా కొనియాడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఒక హ్యాపెనింగ్ స్టేట్…హైదరాబాద్ గ్లోబల్ సిటీ.
హైదరాబాద్ లో ఎన్ని కంపెనీలు, పరిశ్రమలు ఉన్నాయో, ఎంతమంది కంపెనీ సెక్రెటరీలు అవసరమో అధ్యయనం చేయాల్సిన బాధ్యత ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియన్ పై ఉంది. చాలా కంపెనీలలో కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని అమలు చేయడం లేదన్నారు. దీనిని సరిగ్గా అమలు చేస్తే వచ్చే నిధులతో తెలంగాణ మొత్తాన్ని బహిర్భూమి లేని రాష్ట్రంగా చేయవచ్చన్నారు. కంపెనీలు ఈ కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని సరిగా అమలు చేసే విధంగా చట్టంలో కావాల్సిన సవరణల కోసం ఈ సంస్థ సూచనలు చెయ్యాలన్నారు.
కంపెనీ సెక్రెటరీలు తయారు చేసేందుకు ఈ సంస్థతో త్వరలోనే ఉన్నత విద్యా మండలితో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయిస్తానన్నారు. ఈ రంగంలో డిప్లొమా కోర్స్ పెడితే చాలా చిన్న, చిన్న కంపెనీలకు కూడా సెక్రెటరీలు పెట్టుకొనే అవకాశం లభిస్తుందని, ప్రస్తుతం చాలా కోర్సులు మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా లేవన్నారు. ఇలాంటి కోర్సులు డిసైన్ చేయడంలో కూడా ఈ ఇనిస్టిట్యూట్ ముందుకు రావాలని. జిఎస్టీ పై ఇంకా సరైన అవగాహన లభించడం లేదని సూచించారు. దీనిపై విస్తృతమైన ప్రచారం చేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నోట్ల రద్దు వల్ల అనుకున్నంత మేలు జరుగలేదన్నారు.