
TNTUC ఆధ్వర్యంలో భూనిర్వాసితులకు శాశ్వత ఉపాధి అవకాశాలు, కాంట్రాక్టు కార్మికుల ను క్రమబద్దీకరించాలి అంటూ గతవారం రోజులు నుంచి వివిధ రకాలుగా నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రభుత్వం వారం రోజులగా నిరసన చేస్తున్న తమను పట్టించుకోవడం లేదని టీఎన్ టీయూసీ ఆధ్వర్యంలో కేటీపీపీ ప్రధాన గేటు ముందు టీడీపీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ చార్జి గండ్ర సత్యనారాయణ రావు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. నిరాహార దీక్షల్లో ఆయన పాల్గొన్నారు.
కేటీపీపీ టీఎన్ టీయూసీ అధ్యక్షులు జీ. రమేశ్, శంకర్, , ఎస్సీ, ఎస్టీ కేటీపీపీ వర్కింగ్ అధ్యక్షులు బొమ్మకంటి రాజేందర్, చిలువేరు మల్లయ్య కుమార్, భూనిర్వాసిత కమిటీ అధ్యక్షులు కొత్త రాజేందర్, నాగరాజు, ఐఎన్ టీయూసీ నుంచి శ్రీపాల్, సంజీవ్ సొసైటీ నుంచి రవిందర్ రెడ్డి, యేసు, ఏఐటీయూసీ నుండి కృష్ణ, గణపురం టీడీపీ నుంచి శివశంకర్, రాంరెడ్డి, తిరుపతి రావు, వివిధ కార్మిక సంఘాల నాయకులు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.