టీఎన్ఎస్ఎఫ్ ఫీజు పోరు

అరెస్టయిన టీ టీఎన్ఎస్ఎఫ్ నేతలను పరామర్శించిన తెదేపా రాష్ట్ర్ర నేతలు
ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం నాడు నిర్వహించిన సంక్షేమ భవన్ ముట్టడి కార్యక్రమం విజయవంతమైందని మధుసూధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సుమారు 300 మంది టీఎన్ఎస్ఎఫ్ విద్యార్ధులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర్ర అధ్యక్షులు చిలుక మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ లు కాంట్రాక్టర్లకు ఆఘమేఘాల మీద పెండింగ్ బిల్లులు చెల్లిస్తూ, విద్యార్ధులకు మాత్రం ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధులను విడుదల చేయడం లేదని విమర్శించారు. ఇంతవరకు మెస్ ఛార్జీలు కూడా విడుదల చేయకుండా విద్యార్ధులపై
కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. 2014-15 సంవత్సరానికి సంబంధించి రూ.2వేల కోట్ల బకాయిలున్నప్పటికీ నేటికీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. ఫీజులు కట్టాలి, లేకుంటే రానివ్వమని కాలేజీత యాజమాన్యం విద్యార్ధులపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే అనేక కళాశాలల యాజమాన్యాలు విద్యార్ధులపై ఒత్తిడి చేస్తున్నాయన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్ధుల చదువుకు దూరమవుతున్నారని, గ్రామజ్యోతి, స్త్కె సిటీల మీద ఉన్న శ్రద్ధ విద్యార్ధుల మీద లేదని మదుసూదన్ రెడ్డి విమర్శించారు. ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని కళాశాలల యాజమాన్యం చెబుతున్నా విద్యాశాఖామంత్రి కడియం శ్రీహరి
పట్టించుకోవడంలేదు. వరంగల్ పార్లమెంటు సీటు కూతురికి ఇప్పించుకునేందుకు చేస్తున్న కసరత్తులో ఒక్క శాతం కూడా విద్యార్ధులపై దృష్టి సారించడంలేదన్నారు. ఆగస్టు 30 కల్లా ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయకుంటే సీఎం కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీఎన్ఎస్ఎఫ్ విద్యార్ధులను పోలీసులు అమానుషంగా అరెస్టులు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారని, అరెస్టు చేసిన టీఎన్ఎస్ఎఫ్ నేతలను తెలంగాణ రాష్ట్ర్ర తెదేపా నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రకాష్ గౌడ్, కృష్ణాయాదవ్ లు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న టీఎన్ఎస్ఎఫ్ విద్యార్ధులపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారన్నారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిల విషయాన్ని అసెంబ్లీలో లేవనెత్తి విద్యార్ధులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర్ర ప్రధాన కార్యదర్శులు సగరపు ప్రసాద్, రవీందర్ లతో పాటు టీఎన్ఎస్ఎఫ్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శరత్ చంద్ర, రఘుకిరణ్ తోపాటు రాష్ట్ర్ర, జిల్లా నాయకులు మీరాజ్ ఖాన్, ప్రసాద్, శివ, సాయిబాబా, అవినాష్, రాములు, సుజయ్, జగదీష్, శివానంద్, శివతేజ, సుశాంత్ తోపాటు వందలాదామంది టీఎన్ఎస్ఎఫ్ నేతలు పాల్గొన్నారు.

 

టీఎన్ఎస్ఎఫ్ నేతలను అరెస్ట చేస్తున్న పోలీసలు

టీఎన్ఎస్ఎఫ్ నేతలను అరెస్ట చేస్తున్న పోలీసలు

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.