Breaking News

టీఆర్ఎస్ లో వారసుడిపై జోరుగా చర్చ

85083189-kcr-famli647x450

కేసీఆర్ తరువాత తెలంగాణ ఎవరు..? ఇప్పుడు ఇదే ప్రశ్న టీఆర్ఎస్ లో చర్చనీయాంశమైంది. గ్రేటర్ బాధ్యతలను కొడుకు కేటీఆర్ కు అప్పగించిన కేసీఆర్ అనక కొడుకు తన స్టామినాను రుజువుచేసుకొని గెలిపించడంతో సర్వత్రా కేసీఆర్ వారసుడిపై క్లారిటీ వచ్చేసింది..  ఇన్నాళ్లు పోటీలో ఉన్న హరీష్ రావును పక్కనపెట్టి ఇప్పుడు కేసీఆర్ తరువాత కేటీఆర్ అని పార్టీ నాయకులు విశ్వసిస్తున్నారు..

కేసీఆర్ తరువాత టీఆర్ఎస్ కు హరీష్ రావు, లేదా కేటీఆర్ వీరిలో ఎవరు వారసుడనే ప్రశ్న ఈ మధ్య అందరినోళ్లలో నానుతోంది. మరో 20 ఏళ్ల వరకు కేసీఆర్ పార్టీకి నాయకత్వం వహిస్తాడని ఈ మధ్య విలేకరుల సమావేశాల్లో కేటీఆర్, హరీష్ చెబుతున్నప్పటికీ టీఆర్ఎస్ శ్రేణుల్లో మాత్రం ఈ ప్రశ్న అందని ద్రాక్షలానే ఉండిపోయింది. అంతుచిక్కని ఈ ప్రశ్న కేసీఆర్ కుమార్తె ఎంపీ కవిత కు కూడా ఎదురైంది.. దానికి ఆమె తడుముకోకుండా కారణాలను విశ్లేషించారు.. ముమ్మాటికీ టీఆర్ఎస్ కు వారసడు .. కేటీఆరేనని తేల్చిచెప్పారు కవిత.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చిన కేటీఆర్  అలుపెరగకుండా శ్రమించి  కేసీఆర్ వారసుడని నిరూపించాడని ఆమె చెప్పారు..  సీఎం కేసీఆర్ స్ఫూర్తితో కేటీఆర్ పగలు రాత్రి శ్రమించారు.  ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ యంత్రాంగాన్ని బాగా వినియోగించుకొని స్వయంగా గల్లీ గల్లీ తిరిగారు..   అయినా పార్టీకి పెద్ద దిక్కు అయిన కేసీఆర్ ఉండగా ఈ చర్చ అనవసరం.. కానీ భవిష్యత్తులో కేటీఆర్ వారసడు’’ అని కవిత విలేకరులతో స్పష్టం చేశారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *