టీఆర్ఎస్ లో టీడీపీ విలీనం..!

All-Parties-Leaders-620x330

రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ 4వ నిబంధన ప్రకారం టీడీపీ పార్టీని టీఆర్ఎస్ లో విలీనమైనట్టు గుర్తించాలని తెలంగాణ శాసన సభ స్పీకర్ కు శుక్రవారం  లేఖ రాశారు ఎర్రబెల్లి దయాకర్ రావు.. తాము మొత్తం గెలిచిన ఎమ్మెల్యేల్లలో మెజార్టీ 10 మంది వరకు టీఆర్ఎస్ లో చేరామని.. కాబట్టి నిబంధనల ప్రకారం టీడీపీ టీఆర్ఎస్ లో చేరినట్టు గుర్తించి అనుమతి ఇవ్వాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. శాసనసభలో తమను టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలని.. తమకు సీట్లు కేటాయించాలని కోరారు. ఈ లేఖలో తలసాని శ్రీనివాస యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సాయన్న, ప్రకాష్ గౌడ్, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాధవం కృష్ణారావు, కేవీ వివేకానంద గౌడ్, ధర్మారెడ్డి, రాజేందర్ రెడ్డి సంతకాలు చేశారు. కాగా ఈ పరిణామంతో శాసనసభలో టీడీపీ ఉనికి లేకుండా పోతుంది. టీడీపీ శాసనసభాపక్ష నేత సహా 10మంది చేరడంతో ఇక మిగిలిన రేవంత్, ఇతర 3 ముగ్గురు ఎమ్మెల్యేలు స్వతంత్ర్య అభ్యర్థులుగానే గుర్తించబడతారు. టీడీపీ టీఆర్ఎస్ లో విలీనమైనట్టు స్పీకర్ గుర్తిస్తే ఇక తలసాని, టీడీపీ ఎమ్మెల్యేలపై ఉన్న అనర్హత వేటునుంచి బయటపడతారు. రేవంత్ సహా మిగతా ఎమ్మెల్యేలకు టీడీపీ విప్ దక్కకుండా పోతుంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *