
జగిత్యాల క్యాంపు ఆఫీసులో పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామానికి చెందిన యాదవ కుల సభ్యులు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొప్పుల వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పథకాలను వివరించి పార్టీ గెలుపునకు కృషి చేయాలని కోరారు.