టీఆర్ఎస్ లోకి డీఎస్.?

హైదరాబాద్ : కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ నేతలకు దూరంగా ఉంటున్న డీఎస్ టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ఆయన కార్యకర్తలు తెలిపారు. ఇటీవల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ వచ్చినా కూడా డీఎస్ ఆయన్ను కలవలేదు.. డిగ్గీరాజా డీఎస్ ఇంటి వస్తానని ఫోన్ చేసినా ఆయన నన్ను కలవద్దంటూ తెగేసి చెప్పాడట.. దీంతో డీఎస్ కాంగ్రెస్ నుంచి బయటకు రానున్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవల ఎమ్మెల్సీ టికెట్ విషయంలో తనను కాదని నిజామాబాద్ కు చెందిన ఆకుల లలితకు టికెట్ ఇవ్వడం గెలిపించుకోవడం  డీఎస్ కోపానికి కారణం.

కాగా డీఎస్ కు కేసీఆర్ కూడా బంపర్ ఆఫర్ ఇచ్చారట.. టీఆర్ఎస్ లో చేరితే రాజ్యసభ టికెట్ ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారట.. దీంతో డీఎస్ టీఆర్ఎస్ లో చేరికపై తన సన్నిహితులు, నాయకులతో చర్చలు జరుపుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *