టీఆర్ఎస్ ప్లీనరీలో లేని గుడ్డు, చికెన్

-తెలంగాణ వంటకాలు, దేశంలోని అన్ని వంటలకు చోటు, నానెవెజ్, వెజ్ రుచులు

హైదరాబాద్ :  ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యే టీఆర్ఎస్ ప్లీనరీకి సకల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో కార్యకర్తల కోసం దేశంలోని ప్రముఖ వంటలకు చోటు కల్పించారు. బిర్యానీ, మటన్, చేపలు, రొయ్యలు, ప్రముఖంగా తెలంగాణ వంటకాలకు పెద్దపీట వేస్తున్నారు. గుడాలు, బబ్బర్ల వేపుడు, సర్వపిండి, వేసవికాలం కావడంతో పండ్లరసాలు, జ్యూసులు, షర్బత్, పాల, పెరుగు షర్బత్ లు ఇలా ప్లీనరీకి హాజరయ్యే కార్యకర్తలు, నాయకులు ఆ నాలుగు రోజులు భారీగా ఎంజాయ్ చేయనున్నారు.

దీంతో టీఆర్ఎస్ ఆవిర్భావి దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. అనంతరం పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. కేసీఆర్ ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దాని ప్రకటనను సభలో హోంమంత్రి ఎన్నికల ఇన్ చార్జి నాయిని ప్రకటిస్తారు. నాయిని కేసీఆర్ ను అధ్యక్షుడిగా ప్రకటించగానే పెద్ద ఎత్తున టాపాసులు కాల్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం తమిళనాడు శివకాశి నుంచి టాపాసులను, వాటిని కాల్చేందుకు నిపుణులను తీసుకొస్తున్నారట.. సో ఈసారి అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఓ మహోత్సవంలా జరుగబోతోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *