
తెలంగాణ కాంగ్రెస్ ఎట్టకేలకు టీఆర్ఎస్ పై సమరానికి సిద్ధమైంది.. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు వెల్లాలని పీసీసీ నిర్ణయించింది.. గురువారం నల్గొండ ఎంపీ గుత్తా సహా పలువు రు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరడంపై గాంధీభవన్ లో సమావేశమైన కాంగ్రెస్ నాయకులు ఇక టీఆర్ఎస్ పై యుద్ధం ప్రకటించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ రాజ్యాంగబద్దంగా ఎన్నికైనా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ నాయకులను చేర్చుకుంటున్నారని ధ్వజమెత్తారు.
దీనిపై ఈనెల 28న సుప్రీంకోర్టుకు వెళ్లాలని టీ కాంగ్రెస్ నిర్ణయించింది. సుప్రీంకు సెలవులు పూర్తవగానే టీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులపై సుప్రీంలో ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. ఢిల్లీ స్థాయిలో టీఆర్ఎస్ రాజనీతిని ఎండగడతామని ఉత్తమ్ స్పష్టం చేశారు.