టీఆర్ఎస్ పాలనపైనే ప్రజలకు నమ్మకం

టీఆర్ఎస్ పాలనపైనే ప్రజలకు నమ్మకం

తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు
టీఆర్ఎస్ పాలనపైనే ప్రజలకు నమ్మకం ఉందని, మరోసారి పట్టం కట్టేందుకు సన్నద్ధమవుతున్నారని తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.  జనగామ జిల్లా పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగలహారతులు, కోలాటం, ఆటపాటలు,  డప్పుచప్పుళ్లు, ఒగ్గుడోళ్లతో స్వాగతం పలికారు.  నాలుగేళ్లలో సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు రాష్ట్ర్ర ప్రజలు ప్రశంసించారని, ఆయన పాలనపై నమ్మకంతోనే టీఆర్ఎస్ లో భారీగా చేరుతున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలకు దేశ వ్యాప్తంగా ఆదరణ లభించిందని, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఆసరా, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, రైతుబంధు, రైతుబీమా పథకాలతో అనేక మంది లబ్ధిపొందుతున్నారన్నారు. పేదల అభ్యున్నతే లక్ష్యంగా  కేసీఆర్ ముందుకెళ్తున్నారన్నారు. తెలంగాణ పథకాలు ప్రతీ ఇంటికి చేరాయన్నారు. ఈ ఎన్నికల్లో సీఎంగా కేసీఆర్ నే మళ్లీ గెలిపించుకోవాలన్నారు. అంతకుముందు బొమ్మెర గ్రామంలో  కడకంచి పాపయ్య ఎన్నికల ఖర్చు నిమిత్తం రూ.10,000/- అందజేశారు.  చినూర్ యాకయ్య చికెన్ షాప్ లో ఎర్రబెల్లి చికెన్ కొట్టి ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ,మండల పార్టీ అధ్యక్షుడు నల్ల నల్లనాగిరెడ్డి, వ్యవసకమిటీ చైర్మన్ రాంబాబు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

errabelli dayakar rao 1     errabelli dayakar rao 2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *