టీఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి

టీఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి

-పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఎన్నికల్లో టీఆర్ ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పాలకుర్తి టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రుర్ మండలం చీకటాయ పాలెం గ్రామంలోని కాంగ్రెస్ కు చెందిన 20 మంది టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎర్రబెల్లి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని, నాయకులు కార్యకర్తలు అందరు కలిసి కట్టుగా ప్రచారం చేయాలని సూచించారు. ప్రతిపక్షాలకు ఓటడిగే హక్కు లేదని, ఎన్నికల్లో వారి డిపాజిట్లు గల్లంతవడం ఖాయమని అన్నారు. నియోజకవర్గంలోని సబ్బండ వర్గాలు తనకు మద్దతు తెలుపుతున్నాయని, భారీ మెజార్టీతో గెలిపిస్తారని తెలిపారు. కుల వృత్తులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిచ్చిందని, అన్ని కుల సంఘాలు టీఆర్ఎస్ కు మద్దతుగా కదిలి వస్తున్నాయని అన్నారు. పార్టీ కోసం పని చేసే ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని తెలిపారు. అంతకుముందు పార్టీలో చేరినవారిలో ప్రశాంత్, వెంకటేష్, నాగ ప్రశాంత్, యాకుబ్, గణేష్, జంపి, ఉమేష్, కృష్ణ, మురళీ, మహేష్ ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *