టీఆర్ఎస్ తోనే బంగారు తెలంగాణ

టీఆర్ఎస్ తోనే బంగారు తెలంగాణ

తాజా మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్
టీఆర్ఎస్ తోనే బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుందని, మరోసారి కారు గుర్తుకు ఓటేసి ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని తాజా మాజీ ఎమ్మెల్యే, ధర్మపురి నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుగ్గారం మండలం వెల్గొండ, బుగ్గారం గ్రామాల్లో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. అరవేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు. అవినీతి,కుంభకోణాలతోనే కాంగ్రెస్ కాలం వెళ్లదీసిందని, ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ప్రత్యేక రాష్ర్టంలోని అభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్ ను ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెబుతారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ కు అండని, ఇందుకు టీఆర్ఎస్ కు లభిస్తున్న ఆదరణే నిదర్శనమని అన్నారు. టీఆర్ఎస్ తోనే తెలంగాణలోని అన్ని వర్గాలకు గుర్తింపు లభించిందన్నారు. పీఏసీఎస్ ఛైర్మన్ బాదినేని రాజేందర్ పాల్గొన్నారు.

koppula eshwar 1     koppula eshwar 2     koppula eshwar 3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *