టీఆర్ఎస్ తోనే పాలకుర్తి ప్రగతి

టీఆర్ఎస్ తోనే పాలకుర్తి ప్రగతి

ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు
టీఆర్ఎస్ తోనే పాలకుర్తి ప్రగతి పథంలో దూసుకెళ్తోందని పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ రూరల్ రాయపర్తి మండలం కొండాపురం గ్రామంలో కాంగ్రెస్ నుంచి 20 కుటుంబాలు టీఆర్ఎస్ లో చేరాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎర్రబెల్లి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ లో చేరుతున్న ప్రతీ కార్యర్తను ఆదుకుంటామన్నారు. టీఆర్ఎస్ తోనే పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని, అభివృద్ధి కొనసాగాలంటే టీఆర్ఎస్ విజయం అవసరమని అన్నారు. పార్టీ గెలుపునకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. అంతకుముందు ఎర్రబెల్లి సురేందర్ రావు, బొంపల్లి వెంకట్ రావు ఆధ్వర్యంలో సోమేశ్వర్ రావు, ఎల్లగౌడ్, చంద్రయ్య, మల్లయ్య, యాకయ్య, స్వామి, ఉప్పలయ్య, వెంకటయ్య, రాజు టీఆర్ఎస్ లో చేరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *