టీఆర్ఎస్ తోనే పాలకుర్తి సస్యశ్యామలం

టీఆర్ఎస్ తోనే పాలకుర్తి సస్యశ్యామలం

-టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు
టీఆర్ఎస్ తోనే పాలకుర్తి నియోజకవర్గంలోని భూములు సస్యశ్యామలమవుతాయని పార్టీ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూర్, మంచుప్పుల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో మహిళలు మంగళహారతులు, కోలాటం, బతుకమ్మలు, బోనాలు, డప్పుచపుళ్లతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు స్వయం పాలనను కోరుకుంటున్నారని, ఆంధ్రపాలకులతో జట్టు కట్టిన కాంగ్రెస్ కు గుణపాఠం చెబుతారని అన్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణను నిర్లక్ష్యం చేశాయని, నీళ్లు, నిధులను దోచుకున్నాయని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. అనేక పథకాలు ప్రవేశ పెట్టి తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకున్న ప్రతి పక్షాలు ఇప్పుడు మహాకూటమి పేరుతో ఓట్ల కోసం వస్తోందని, ఎన్నికల్లో వారికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. నిరంతరం తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతున్న టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని కోరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ రైతాంగానికి పెద్దపీట వేశారని, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల విద్యుత్, పంటరుణ మాఫీ వంటి పథకాలు ప్రవేశ పెట్టారని తెలిపారు. నియోజకవర్గంలోని సాగునీటి కష్టాలను తీర్చేందుకు గోదావరి జలాలు తీసుకురానున్నట్లు చెప్పారు. తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని, వారికి బుద్ధి చెప్పడానికే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని తెలిపారు. ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటేసీ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు మాజీ ఎమ్మెల్యే ఎన్. సుధాకర్ రావు, ఎంపీపీ, మండల పార్టీ అధ్యక్షుడు నల్ల నాగిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

errabelli dayakar rao 1     errabelli dayakar rao 2     errabelli dayakar rao 3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *