టీఆర్ఎస్ తోనే పారదర్శక పాలన

టీఆర్ఎస్ తోనే పారదర్శక పాలన

– తాజా మాజీ తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్
-పెగడపల్లిలో ఎన్నికల ప్రచారం
టీఆర్ఎస్ తోనే తెలంగాణలో పారదర్శక పాలన సాధ్యమవుతుందని తాజా మాజీ తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వెంగళాయిపేట, నంచర్ల, దోమలకుంట, మద్దులపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పసిగుడ్డులాంటి తెలంగాణను నాలుగేళ్లలో సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా అభివృద్ధి చేశారన్నారు. మరోసారి అవకాశమిస్తే బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతారన్నారు. ఎస్సారెస్పీ నీటిపై కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, బడుగు బలహీన వర్గాల ప్రజల ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన పథకాలతో కేసీఆర్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించిందన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అంతకుముందు కొప్పులకు గ్రామాల్లో ఘన స్వాగతం పలికారు. మహిళల బోనాలు, బతుకమ్మలు, డప్పుచప్పుళ్లతో పండగ వాతావరణం నెలకొంది.

KOPPULA ESHWAR 1     KOPPULA ESHWAR 2     KOPPULA ESHWAR 3     KOPPULA ESHWAR 4     KOPPULA ESHWAR 5     KOPPULA ESHWAR 6

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *