టీఆర్ఎస్ జెండా ఎగరకపోతే రాజీనామా: కేటీఆర్

ktr

హైదరాబాద్ : టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పొల్గొని మాట్లాడారు.. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా ఎగరకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.. నా సవాల్ ను స్వీకరించేందుకు ప్రతిపక్షాలు ముందుకు వస్తాయా అని ప్రశ్నించారు. 100 స్థానాల్లో విజయం సాధిస్తామని.. ఎవరితోనూ పొత్తు లేదని తేల్చిచెప్పారు. నాకు మంత్రి పదవే ఎక్కువన్నారు. ముఖ్యమంత్రి పదవిపై ఆశలేదని తేల్చిచెప్పారు. మరో 15 ఏళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలని ఆకాంక్షించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *