
-మళ్లీ కేసీఆరే సిఎం కావాలి
-అభివృద్ధి కొనసాగాలి
-తాజా మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్
– వెల్గటూర్ లో ఎన్నికల ప్రచారం
ఆంధ్రపాలకుల పాలన వెనకబడిన తెలంగాణలో అభివృద్ధి కొనసాగాలంటే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు చారిత్రక అవసరమని తాజా మాజీ ఎమ్మెల్యే, ధర్మపురి నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వెల్గటూర్ మండలం ఎండపెల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి తనకు అవకాశమిచ్చిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతీ ఎకరాకు నీరందిస్తానన్నారు. గ్రామాల్లో అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యమని, ప్రతీ గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. చిన్న గ్రామ పంచాయతీలతోనే పాలన సులభమవుతుందనే ఆలోచనతో సీఎం కేసీఆర్ కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తున్నట్లు చెప్పారు. హుస్నాబాద్ ప్రజలకు సాగు, తాగు నీటి కష్టాలు త్వరలో తీరనున్నాయన్నారు. నియోజకవర్గంలో రిజర్వాయర్ల పనులు పూర్తి కావస్తున్నాయని, సాగు నీటికి ఇబ్బందులు ఉండవని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు సరఫరా చేయనున్నట్లు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గంగుల పద్మ అశోక్, పీఏసీఎస్ ఛైర్మన్ రాంమ్మోహన్ రావు పాల్గొన్నారు .