టీఆర్ఎస్ గెలిచినా ఓడినట్టే..

మొన్నటి మెదక్ ఎన్నికల్లో ఘన విజయం.. కంటోన్మెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం.. టీఆర్ ఎస్ పాలనకు జనం మెచ్చి వేసిన ఓట్లు అని అధికార పార్టీ అహంభావం పీక్ స్టేజికి చేరింది. కానీ ఇవ్వాల్టీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో టీఆర్ఎస్ ను భూమి మీదకు తెచ్చారు పట్టభద్రులు.

ఏకపక్ష నిర్ణయాలతో, దుందుడుకుగా ముదుకెళ్తున్నటీఆర్ఎస్ కు కర్రు కాచి వాత పెట్టరు. అడిగివాళ్లకు, అడగనివాళ్లకు వరాలిస్తూ కోట్లు కుమ్మరిస్తున్న సీఎం కేసీఆర్ చేసిన అతిపెద్ద తప్పు.. ఉద్యమానికి ఊపిరిలూదిన విద్యార్థులను, నిరుద్యోగులను ఇప్పటివరకు పట్టించుకోకపోవడమే.. అసెంబ్లీలో ఎన్నికల వేళే డీఎస్సీ, ఉద్యోగాలు ఇప్పట్లో వేయమని ప్రకటించడమే.. తెలంగాణ వస్తే తమకు ఉద్యోగాలొస్తాయని ఆశగా 9 నెలల నుంచి ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఈ నిర్ణయాలు ఆశనిపాతంలా మారాయి. అందుకే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఒకరిని (దేవిప్రసాద్)ను ఓడించారు. మరొకరిని(పల్లా రాజేశ్వర్ రెడ్డి)ని ఓడించినంత పనిచేశారు.

ఇఫ్పటికైనా అధికార టీఆర్ఎస్ రూటు మార్చుకుంటే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తారు. ఇలాగే మొండిగా వెళితే.. కాలగర్భంలో కలిపేందుకు ఓటర్లు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. రాజధానిలో సచివాలయాలు, బహుళ అంతస్థులతో ఓటర్లకు పనిలేదు. తమకు ఏం ఇచ్చారనేది వారు చూస్తారు. అది నెరవేర్చకపోతే ఇలాగే కర్రు కాచి వాత పెడతారు.. సో .. టీఆర్ఎస్ నాయకుల్లారా.. పారా హుషార్..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *