
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై టీఆర్ఎస్ గుండాలు (ఎమ్మెల్యేలు) దాడులు చేశారని టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిలు మండిపడ్డారు. మార్షల్స్ ను అడ్డుపెట్టుకుని టీడీపీ ఎమ్మెల్యేలపై దాడులకు దిగడం అమానుషమన్నారు.
టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన తలసాని శ్రీనివాసయాదవ్ తో పాటు మిగితా టీడీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ప్లకార్డులతో నిరసన తెలిపితే తమపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇలా దాడులకు తెగబడడం శాసనసభ చరిత్రలోనే తొలిసారి జరిగిందన్నారు.