టీఆర్ఎస్ కే సకల జనుల మద్దతు

టీఆర్ఎస్ కే సకల జనుల మద్దతు

టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు
తెలంగాణలోని సబ్బండ వర్ణాలు టీఆర్ఎస్ కే మద్దతు తెలుపుతున్నాయని, ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రుర్ మండలకేంద్రంలో కాంగ్రెస్ కు చెందిన 60 కుటుంబాలు టీఆర్ఎస్ లో చేరాయి. ఈ సందర్భంగా ఎర్రబెల్లి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో ఎవరూ చేయని అభివృద్ధిని నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందన్నారు. అధికారంలోకి రాగానే రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని, పంట రుణాలు మాఫీ చేశామని అన్నారు. గతంలో మేనిఫెస్టోలో చెప్పని పథకాలను కూడా కేసీఆర్ ప్రవేశ పెట్టారని తెలిపారు. రైతుబంధు పథకం కింద రూ.4వేలు పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదవశాత్తు రైతులు మరణిస్తే బాధిత కుటుంబాలు రోడ్డున పడకుండా రూ.5లక్షలు బీమా వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలతో పేదింటి కుటుంబాల ఆడ పిల్లలను ఆదుకుంటున్నట్లు చెప్పారు. యువతకు ఉపాధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ లు ఏర్పాటు చేసి రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు పార్టీలో చేరిన వారిలో తూరుపాటి పాండు బెడ బుడగజంగల రాష్ట్ర అధ్యక్షుడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సారయ్య, అజయ్, సాగర్, శ్రీరామ్, విజయ్, సందీప్, యాకుబ్ తదితరులు ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *