టీఆర్ఎస్ కు అండగా పాలకుర్తి ప్రజలు

టీఆర్ఎస్ కు అండగా పాలకుర్తి ప్రజలు

-ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు
పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు టీఆర్ఎస్ కు అండగా ఉన్నారని, ఇందుకు నిదర్శనం పార్టీలోకి పెరుగుతున్న వలసలేనని పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు న్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సీత్యతండాలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో పది కుటుంబాలు చేరాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎర్రబెల్లి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ తోనే బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటేసి మరోసారి గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన పాక్షిక మేనిఫెస్టోతో కాంగ్రెస్ నేతలు బెంబేలెత్తుతున్నారన్నారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ మేనిఫెస్టోను విమర్శిస్తున్నారన్నారు. దాచుకోవడం, దోచుకోవడం కాంగ్రెస్ కే తెలుసన్నారు. బడుగుబలహీన వర్గాల అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందన్నారు. మరోసారి టీఆర్ఎస్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను తరిమికొట్టాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని, గత ప్రభుత్వాలు అభివృద్ధిని విస్మరించాయని అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలోని అన్ని కులాలకు సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు. ప్రత్యేక కార్పొరేషన్ లు ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. అంతకుముందు గుగులోతు విక్రమ్, ఉపేందర్, సీతారాం, సత్తి, బాలు, శారదా, కిషన్, నారి పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *