టీఆర్ఎస్ ఓట్ల సునామీకి కారణం ఇదే..

16-1447674100-kcr-idh-645

ఒకే ఒక్క పథకం.. టీఆర్ఎస్ కు ఓట్లు కురిపించింది. గ్రేటర్ పీఠాన్ని కట్టబెట్టింది. 60 ఏళ్లుగా ఏ పార్టీకి రాని మెజార్టీ సీట్లను కట్టబెట్టింది.. అదే డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం.. ఇదే గ్రేటర్ వాసుల మనసులు కొల్లగొట్టి టీఆర్ఎస్ విజయానికి బాటలు వేసింది.. డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా అవి జనం నమ్మలేదు.. కేసీఆర్ పదే పదే విశ్వనగరం చేస్తాం.. పేదలకు డబుల్ బెడ్ రూం కట్టిస్తాం.. లేకపోతే ఓట్లు అడగం అన్న మాటలు జనాన్ని తాకాయి.. కేసీఆర్ బహిరంగ సభలో చేసిన హామీలు, విమర్శలు సైతం ప్రతిపక్షాల స్థైర్యాన్ని దెబ్బతీశాయి.. దీంతో టీఆర్ఎస్ కు ఓట్ల పండగ వచ్చింది.. దీనికి తోడు సెటిలర్లు ఉన్న చోట వారికే టికెట్ ఇచ్చి తాము కూడా సెటిలర్లమే అని కేటీఆర్ చెప్పడంతో సీమాంధ్రుల ఓట్లన్ని టీఆర్ఎస్ కే పడ్డాయి.. అంతేకాదు.. ఏపీలో కాపు ఉద్యమం కూడా టీడీపీ నుంచి వారిని దూరం చేసి టీఆర్ఎస్ కు గంపగుత్తగా కాపుల ఓట్లు పడేలా చేశాయి.. అంతే కాదు పేదలకు 6 కిలోల బియ్యం, షాదీముబారక్, కళ్యాలక్ష్మీ పథకాలు కూడా టీఆర్ఎస్ కు ఓట్లు పడడానికి కారణమయ్యాయి..

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *