
ఆదిలాబాద్ : నిన్న ఆదిలాబాద్ జిల్లా నెన్నెల మండల ఏఈఈ దేవందర్ పై దాడికి పాల్పడ్డ బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య వైఖరికి నిరసనగా ఆ జిల్లా ఇంజనీర్లందరూ నిరసన తెలిపారు. కలెక్టర్ సమక్షంలో జరుగుతున్న జిల్లా సమావేశాన్ని బహిష్కరించి వారిని నిలదీశారు. ఎమ్మెల్యేపై చర్య తీసుకోవాలంటూ నినదించారు.
ఎమ్మెల్యే భూకబ్జాలు, పంచాయతీలు, కాంట్రక్టుల్లో భారీగా అక్రమాలు జరుగున్నాయని.. వినని అధికారులను ట్రాన్స్ ఫర్ చేయించడమో.. లేక సాగనంపడమో చేస్తున్నారని అధికారులందరూ సమావేశాన్ని బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ కలెక్టర్, మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్ రెడ్డిలను నిలదీశారు.