టీఆర్ఎస్ ఎత్తుకు పోతోంది.. కాంగ్రెస్ నుంచి పోటీచెయ్..

వరంగల్ : వరంగల్ ఎంపీ ఉప ఎన్నిక రసకందాయంలో పడింది.. టీఆర్ఎస్ తరఫున పోటీ చేయించడానికి మాజీఎంపీ, కాంగ్రెస్ నేత వివేక్ మంత్రులు హరీష్, కేకేలు ప్రయత్నిస్తుండడంతో కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైంది.. వెంటనే వివేక్ ను ఢిల్లీకి పిలిపించారు దిగ్విజయ్ సింగ్. వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని ఒత్తిడి చేశారు.. ‘ టీఆర్ఎస్ నుంచి ఎందుకు కాంగ్రెస్ తరఫునే పోటీ చేయి.. నీలాంటి బలమైన అభ్యర్థిని మేం వదులుకోం’ అంటూ దిగ్విజయ్ సింగ్ బతిలాడాడని సమాచారం.

అయితే ఇందుకు పెద్దపల్లి మాజీ ఎంపీ నిరాకరించారు. తాను , మా నాన్న వెంకటస్వామి పెద్దపల్లి నియోజకవర్గంతో అనుబంధం పెంచుకున్నామని.. ఆ నియోజకవర్గాన్ని కాదని.. వరంగల్ నుంచి పోటీ చేయనని వివేక్ తేల్చిచెప్పారట.. దీంతో వరంగల్ ఉప ఎన్నిక రసకందాయంలో పడింది..

కాగా డబ్బు, పరపతి గల వివేక్ మంచి అభ్యర్థి అని ఇటు కాంగ్రెస్, టీఆర్ఎస్ లు రెండూ ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అందుకే వివేక్ ను ఒప్పించేందుకు ఢిల్లీకి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బయలు దేరి వెళ్లారు.  నేడు రాహుల్, సోనియాలతో భేటి వారి చెప్పించి వివేక్ ను ఎలాగైనా వరంగల్ స్థానం నుంచి పోటీచేయించాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు యోచిస్తున్నారు. ఒక వేళ వివేక్ కాదంటే సర్వే సత్యనారాయణ కానీ, మరో ఇద్దరి పేర్లను పరిశీలించాలని కోరుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *