Breaking News

టీఆర్ఎస్ ఆగడాలు ఎక్కువయ్యాయి : కటకం

katakam mrutynjayam-02

కరీంనగర్, ప్రతినిధి : కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఆగడాలు ఎక్కువయ్యాయని కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కటకం మృత్యుంజయం అన్నారు. ఆయన కరీంనగర్ లో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేసి జైళ్లకు పంపిస్తున్నారని .. వారి పద్ధతి మార్చుకోనట్లయితే ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన కాంగ్రెస్ నాయకులపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. సిరిసిల్లలో తమ పార్టీ కార్యకర్తపై టీఆర్ఎస్ నాయకుడు దాడిచేశారని.. దీనిపై ఫిర్యాదు చేస్తే తమ కాంగ్రెస్ కార్యకర్తపైనే కేసు పెట్టి జైలు పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీ బెదిరింపులకు కాంగ్రెస్ పార్టీ భయపడదన్నారు.

ఫిబ్రవరి 1న కాంగ్రెస్ పార్టీ సమావేశం

కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కోసం ఫిబ్రవరి 1న సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మృత్యుంజయం తెలిపారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై చర్చిస్తామని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *