
వరంగల్ ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ నోటిపికేషన్ జారీ చేసింది. తొలిరోజు ఒక్క నామినేషన్ కూడా పడలేదు. ప్రధాన పార్టీలన్నీ ఇంకా అభ్యర్థి వేటలో ఉన్నాయి. సరైన అభ్యర్థిని దించాలని అన్ని పార్టీలు ప్రకటించన తర్వాత అసంతృప్తులను గుంజి వారిని నిలబెట్టి లబ్ది పొందాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీ అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు.
గురువారం క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, మంత్రి చందూలాల్, పార్టీ ఎమ్మెల్యేలతో పలువురు ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. అభ్యర్థిని ఎవరిని నిలబెట్టాలని నిర్ణయిస్తారు.