
రాజీకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు.. ఓడలు బండ్లు అవుతాయి. బండ్లు ఓడలవుతాయి.. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ వైపే ఇప్పుడు నేతల చూపు ఉంది.. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు టీఆర్ఎస్ ఆకర్ష్ ముందు కుదేలవుతున్నాయి.. కేసీఆర్ వ్యూహాలకు చిత్తవుతున్నాయి. అసలు విషయం ఏంటంటే వరంగల్ లోక్ సభకు ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల దిమ్మ తిరిగే స్కెచ్ వేశారు సీఎం కేసీఆర్.. వరంగల్ నుంచి ఎవరూ ఊహించని విధంగా టీఆర్ఎస్ తరఫున బరిలో కాంగ్రెస్ నేతను నిలుచుండబెడుతున్నారు.
టీఆర్ఎస్ వరంగల్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పెద్దపల్లి మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత వివేక్ ను బరిలో నిలపడానికి కేసీఆర్ నిర్ణయించారు. ఈ బాధ్యతను హరీష్ రావు, కేకేకు అప్పగించారు. నిన్న కేకే నివాసంలో వివేక్ హరీష్, కేకే చర్చలు జరిపారు. అధికార పార్టీ అని వరంగల్ ఎంపీ కి పోటీచేయాలని కోరారు. దీనిపై వివేక్ కూడా ఆసక్తి కనబరిచారు.
వివేక్ భారీ పారిశ్రామిక వేత్త, డబ్బులు నీళ్లలా ఖర్చుపెడతారు.దాంతో అధికార పార్టీ టీఆర్ఎస్ అండ.. దీంతో వివేక్ వంటి బలమైన అభ్యర్థి పోటీ చేస్తే ప్రత్యర్థి పార్టీలకు ఆశలు వదులుకోవాల్సిందే.. అందుకే టీఆర్ఎస్ లో చేరి లోగడ మళ్లీ సొంతగూటికి వెళ్లిపోయిన వివేక్ ను టీఆర్ఎస్ పార్టీ వరంగల్ నుంచి బరిలో నిలపబోతోంది.. వివేక్ టీఆర్ఎస్ తరఫున నిలిస్తే టీఆర్ఎస్ గెలుపు ఖాయం.
కాంగ్రెస్ నుంచి రాజయ్య, రాజారపు ప్రతాప్, విజయరమణరావు,
కాగా కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ రాజయ్య, విజయరమణారావు, రాజారపు ప్రతాప్ ల పేర్లు పోటీకి వినపడుతున్నాయి.వివేక్ కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మాజీ ఎంపీ కావడంతో ఆయనను వరంగల్ నుంచి పోటీ చేయించే ఆలోచన కాంగ్రెస్ అధిష్టానానికి లేదు. దీంతో టీఆర్ఎస్ వివేక్ కు వల వేసి పోటీ చేయించడానికి ప్రయత్నాలు చేస్తోంది.