టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్లీనరీ జరుగుతున్న సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 20న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్లు స్వీకరిస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు. ఈ నెల 21న వరకు నామినేషన్లు పరిశీలిస్తామన్నారు. 23న ఉదయం 11 గంటల వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. అనంతరం ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తామన్నారు. ఒక వేళ పోటీ ఏర్పడితే 24న ఎల్బీ స్టేడియంలో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.

కాగా టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి కేసీఆర్ ఒక్కరే ఇన్నాళ్లు అధ్యక్షుడిగా ఉన్నారు. ఈసారి కూడా ఆయన కొనసాగుతారా.. లేదా వేరొకరికి అవకాశం ఇస్తారా అని తేలాల్సి ఉంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *