టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక

హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకులుగా హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యవహరించారు. కాగా ఉదయం నుంచి కేసీఆర్ తరఫున 6 నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీ అధ్యక్ష పదవికి కేసీఆర్ మినహా ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు నాయిని తెలిపారు. కాగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కేసీఆర్ ను అధ్యక్షుడిగా ప్రతిపాదించగా ఆరుగురు మంత్రులు ఆయనను బలపరిచారు. దీంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇతర నాయకులెవరూ నామినేషన్లు వేయలేదు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *