
ప్రపంచకప్ లో టిమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. గ్రూప్ దశలో ఓటమే లేకుండా ఇండియా క్వార్టర్స్ లో అడుగుపెట్టింది. శనివారం జింబాబ్వేతో జరిగిన గ్రూప్ బి మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 287 పరుగులకు 48.5 ఓవర్లలో అలౌట్ అయి భారీ స్కోరు చేసింది. కెప్టెన్ బ్రెండన్ టేలర్ 138 పరుగులు సెంచరీతో కంద తొక్కడంతో జింబాబ్వే భారీ స్కోరు సాధించింది.
అనంతరం క్లిష్టమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 100పరుగుల లోపే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ చివరకు రైనా సెంచరీ(110), ధోని (85)పరుగులతో అజేయంగా నిలిచి టీమిండియాకు ఇద్దరు విజయాన్నందించారు. భారత్ 48.4ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. సురేష్ రైనాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఈ విజయంతో టీమిండియా గ్రూప్ దశలో అన్ని మ్యాచ్ లు గెలిచి క్వార్టర్స్ లోకి అడుగుపెట్టింది. ఈనెల 19న జరుగనున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా బంగ్లాదేశ్ తో తలపడుతుంది.