టాలెంట్ హంట్ ద్వారా 11 మంది ప్రతిభావంతులకు అవకాశం!

ఈ టివి9 డాట్ నెట్ కరీంనగర్ ప్రెస్ భవన్ లో బుధవారం నిర్వహించిన టాలెంట్ హంట్ లో 11 మంది ప్రతిభావంతులు ఎంపిక అయ్యారు. దర్శకత్వం విభాగంలో గండ్రత్ శ్రీనివాస్, నటులుగా ఎర్రోజు శ్రీనివాస్, జె. అనూష, కొలిపాక సత్యం, ఎం.డి. ఖాలాద్, వి. సందీప్, బొట్ల సాయిదీప్, వై. రాము, గాయకులుగా మున్యారుద్దిన్, స్క్రిప్ట్ రైటర్స్ గా డి. గౌతమ్, పి. సందీప్ లు ఎంపికైనట్లు ఈ టివి 9 డాట్ నెట్ వ్యవస్దాపకులు అయిలు రమేష్, ఫ్రిజ్ సినిమా దర్శకులు శ్రీధర్ కుడిక్యాల తెలిపారు. ‘‘సత్తిగాడు – శ్రీనుగాడు’’ అనే లఘు చిత్రాన్ని నిర్మిస్తున్నామని, ఈ నెల 24వ తేదీన భగత్ నగర్ లోని శివాలయంలో ఘూటింగ్ ప్రారంభిస్తున్నట్లు నిర్మాత అయిలు రమేష్ తెలిపారు.

About The Author

Related posts