జోయల్ డేవిస్ .. స్టిక్ట్ ఆఫీసర్

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా ఒకప్పుడు కల్లోల జిల్లాగా పేరొందింది.. ఆ తర్వాత మావోయిస్టుల కనుమరుగుతో ప్రశాంతంగా మారింది.. ఇప్పటికీ తూర్పున గల మంథని నియోజకవర్గంలో ఎక్కడో ఒకచోట అలజడి రేగుతూనే ఉంటుంది.. ఇంత పెద్ద జిల్లాకు ఎస్పీగా కొనసాగడమంటే మాటలు కాదు.. జిల్లాలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో భిన్నత్వం ఉంటుంది..

జగిత్యాల, వేములవాడల్లో క్రైం రేటు ఎక్కువగా ఉంటుంది.. మెట్ పల్లి కూడా కాంట్రవర్సీ ఏరియానే..  ఇటు దక్షిణాన హుస్నాబాద్, హుజూరాబాద్ లు ప్రశాంతంగా ఉంటాయి.. మెట్ట ప్రాంతం కావడంతో ఇక్కడ వలసలు ఎక్కువ.. దీంతో క్రైం రేటు లేదు.. ఇక తూర్పున గోదావరిఖని ముఠాలు, తగాదాలు, గొడవలకు పెట్టింది పేరు.. పక్కనే మావోయిస్టు ప్రభావత మంథని ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి..

అందుకే కరీంనగర్ ఎస్పీ అంటే తెలంగాణలో, ఉమ్మడి ఏపీలో పోలీసు అధికారులకు వణుకే.. ఇక్కడ నిరూపించుకుంటే వారందరూ గొప్ప అధికారులు అయినట్టే.. ఉమేశ్ చంద్ర, శివకుమార్, దేవేంద్ర సింగ్ చౌహాన్ , తదితర కరీంనగర్ ఎస్పీలుగా పనిచేసిన వారందరూ ఇప్పుడు ప్రభుత్వాల్లో కీలకపాత్రల్లో ఉన్నారు. సమర్థ అధికారులుగా పేరు తెచ్చుకున్నారు.

ఖమ్మంలో పనిచేసి కరీంనగర్ ఎస్పీగా పదోన్నతిపై వచ్చిన జోయల్ డేవిస్ తనదైన శైలిలో కరీంనగర్ ఎస్పీగా విశేష సేవలందిస్తున్నారు. వచ్చినప్పటినుంచి శాంతిభద్రతలను కంట్రోల్ చేస్తున్నారు. మావోయిస్టు ప్రాభల్యాన్ని గణనీయంగా తగ్గించి వారు లొంగిపోయేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇటీవలి కాలంలో చాలా మంది మావోయిస్టులు లొంగుబాట పట్టగా.. ఎస్పీ వారికి మంచి పునరావాసం కల్పించారు. అలాగే జిల్లాలో పేట్రేగిన గొలుసు దొంగలను మూడురోజుల క్రితం పట్టుకొని శభాష్ అనిపించుకున్నారు. మొత్తం జోయల్ డేవిస్ కరీంనగర్ లో ఇప్పుడు అక్రమార్కులకు సింహస్వప్నంలా పేరుతెచ్చుకుంటున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *