Breaking News

జోడు గుర్రాలకు తొలి ఓటమి

M_Id_442320_Narendra_Modi_Amit_Shah

గుజరాత్.. అఖండ భారతం దాకా ఆ జోడుగుర్రాలు జతకడితే విజయం ఖాయం.. సార్వత్రిక ఎన్నికల్లో వీరు చేసిన వ్యూహరచనకు బీజేపీకి ఓట్ల వర్షం కురిశాయి. అధికారం దాసోహమైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాలను మోడీ, అమిత్ షాల ద్వయం గెలిచేసింది. పకడ్బందీ ఎన్నికల వ్యూహాలతో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టిన మోడీ-అమిత్ లు సార్వత్రిక ఎన్నికల అనంతరం జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టారు.

ఢిల్లీ విషయంలో లెక్కతప్పింది..
ఢిల్లీ .. దేశ రాజధాని ఇక్కడ గెలిస్తేనే అసలు మజా.. దేశ వ్యాప్తంగా పేరు వస్తుంది.. ఆ ఉద్దేశంతోనే అమిత్ షా వ్యూహాలకు పదునుపెట్టాడు. ఎవరూ ఊహించని విధంగా కిరణ్ బేడిని సీఎం అభ్యర్థిగా రంగంలో దించాడు. మోడీ ప్రచార వ్యూహంతో హడలెత్తించాడు. కానీ చివరకు సామాన్యుడి ముందు నిలవలేకపోయాడు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ జనంలోకి చొచ్చుకెళ్లి ప్రజా సమస్యల ఏజెండాతో జనాల మనసుల్ని గెలిచారు. దీంతో విజయమే తప్ప అపజయం లేని మోడీ-అమిత్ షాలకు తొలిఓటమిని రుచిచూపించాడు ఢిల్లీ ప్రజలు, అరవింద్ కేజ్రీవాల్..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *