జై తెలంగాణ అన్నందుకు పోస్టు ఊడింది..

కరీంనగర్ ,ప్రతినిధి : దాసరి భూమయ్య.. ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్.. ప్రస్తుతం కరీంనగర్ సీఐడీ విభాగం సీఐగా పనిచేస్తున్నారు.. ఇప్పటివాళ్లకు తెలియక పోవచ్చు కానీ.. పదిహేనేళ్లు వెనక్కి వెళితే ఆయనో ఎవరో అందరికీ తెలుసు..

అది 2000 సంవత్సరం .. కరీంనగర్ నక్సలైట్ల కిల్లాగా ఉన్న రోజుల్లో ఎస్.ఐ ఉన్న భూమయ్య.. నక్సలైట్లకు సింహస్వప్నంలా.. అవినీతిపరులకు, దొంగలకు, దోపిడీ దారులకు హిట్లర్ లా పనిచేశాడు. 2000 సంవత్సరంలో అప్పుడు హుస్నాబాద్ లో ఎస్.ఐ గా పనిచేశారు. అప్పుడు స్క్వాడ్ గెరిళ్లా నక్సలైట్ల దళం ఉండేది. దాన్ని రూపుమాపడంలో విశేష కృషి చేశారు. అవినీతి , అరాచకాలు గ్రామాలనుంచి పారదోలాడు. ఎస్.ఐ భూమయ్య రోడ్డుమీదకు వస్తున్నాడంటే అందరూ వణికిపోయేవారు. ఆయన వివిధ కేసుల్లో ఎస్పీలు చెప్పినా వినకపోయేవారు. అంత మొండిగా ఉండేవారు. తదనంతరం జిల్లాలోని చాలా మండలాల్లో కూడా ఆయన ఎస్.ఐ చేశారు. అంతటా అలానే మొండి, ధైర్యవంతుడిగా పనిచేశారు.

పదేళ్లు ముందుకు వెళితే… తెలంగాణ ఉద్యమం లో తనవంతుగా బాసటగా నిలబడ్డాడు దాసరి భూమయ్య.. కరీంనగర్ జిల్లా పోలీసు అధికారుల సంఘం కార్యదర్శిగా కొనసాగిన భూమయ్య, జమ్మికుంట టౌన్ సీఐగా ఉన్న సమయంలో అప్పటి డీజీపీ ఆంధ్రా వైఖరిని కబడ్దార్ అంటూ ప్రశ్నించి జై తెలంగాణ అన్నందుకు వారి ఆగ్రహానికి గురయ్యాడు. అప్పటి ఎస్పీ రవీందర్ , ఇతర ఐపీఎస్ లు ఏకమై దాసరి భూమయ్యకు మెమోలు జారీ చేసి మానసికంగా చాలా వేధించారు. భూమయ్య నక్సల్ టార్గెట్ అయినా ఆయనకు గన్ మెన్ లను ఉపసంహరించారు. ఆ తర్వాత మూడు నెలలకే జమ్మికుంట టౌన్ నుంచి సీఐడీకి అన్యాయంగా బదిలీ చేసి గొంతునొక్కేశారు.

ఈ విషయమై సీఎం కేసీఆర్.. మంత్రి హరీష్ లను కలిసి విన్నవించినా.. వారు హామీలిచ్చినా పాపం దాసరి భూమయ్య తలరాత మారలేదు. తెలంగాణ కోసం పోరాడి.. ఉన్నతాధికారులతో పనిష్మెంట్ కు గురై ఇప్పుడు ప్రయోజనం లేని పోస్టింగ్ తో ఇబ్బందులు పడుతున్నాడు. ఎంతో డేరింగ్ డ్యాషింగ్ ఉద్యమకారుడికి తెలంగాణ వచ్చినా.. ఇంకా కష్టాలు వీడకపోవడం నిజంగా దారుణం. బతుకులు మారుతాయనుకుంటే .. సీమాంధ్రలో అలానే ఉంది. తెలంగాణలో అలానే ఉందని భూమయ్య ఆవేదన వ్యక్తం చేశాడు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *