
ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసిన లింగాల కమల్ రాజును టియుడబ్ల్యుజే (ఐజేయు) సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు శుక్రవారం ఛైర్మన్ ఛాంబర్ లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఐదేళ్ళ పాలను విజయవంతంగా పూర్తి చేసి జిల్లా సర్వతోముఖాభివృధ్ధికి తోడ్పడాల్సిందిగా యూనియన్ నేతలు అకాంక్షించారు. జెడ్పీ ద్వారా వచ్చిన అధికారాన్ని ఉపయోగించి పేద ప్రజల జీవన ప్రమాణాలను పెంపోదిచేందుకు శాయశక్తాల కృషి చేయాలని ఈ సందర్బంగా యూనియన్ నేతలు సూచించారు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యే పదవి కోసం పోరాడినప్పటికి అదృష్టం కలిసి వచ్చి ఇప్పుడు ఏకంగా జిల్లాకే ప్రధమ పౌరుడిగా నిలిచినందుకు అభినందనలు తెలిపారు.
జెడ్పీ చైర్మను కలిసిన వారిలో రాష్ట్ర టియుడబ్య్యుజె ఐజెయు ఉఫాధ్యక్షులు కె రాంనారాయణ, జిల్లా అధ్యక్షులు నర్వనేని వెంకట్రావు, నేషనల్ కౌన్సిల్ సభ్యులు రవీంధ్ర శేషు, రాష్ట్ర నాయకులు ఏనుగు వెంకటేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వనం వెంకటేశ్వర్లు,నగర కమిటి కన్వీనర్ మైసా పాపారావు, జిల్లా ఆర్గనైజిగ్ సెక్రటరీ వై మాధవరావు, నాయకులు ఎం డి మైనోద్దిన్, ఉషోదయం శ్రీనివాస్, భాస్కర్, ఎం.వెంకన్న, వంశీ తదితరులు ఉన్నారు.