Breaking News

జెట్ స్పీడ్ గా రైతులకు చెక్కులు పాసుబుక్కులు పంపిణీ చేసిన కొప్పుల ఈశ్వర్

జెట్ స్పీడ్ గా రైతులకు చెక్కులు పాసుబుక్కులు పంపిణీ చేసిన కొప్పుల ఈశ్వర్

జెట్ స్పీడ్ గా రైతులకు చెక్కులు పాసుబుక్కులు పంపిణీ చేశారు కొప్పుల ఈశ్వర్.     జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కొత్తపేట గ్రామంలో రైతు పథకానికి శ్రీకారం చుట్టిన ధర్మపురి శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ వరుసగా అనేక గ్రామాల్లో లబ్ధిదారులకు చెక్కులు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. గొల్లపల్లి మండలం శ్రీ రాముల పల్లె గ్రామంలో రైతులకు పాసుపుస్తకాలు, చెక్కులు అందజేశారు కొప్పుల ఈశ్వర్. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కటారి చంద్రశేఖరరావు, మండల పరిషత్ అధ్యక్షులు కాంపల్లి సత్య హనుమాన్లు, జెడ్ పి టి సి సభ్యులు శైలజ జలంధర్, సి రాజేశం తదితరులు పాల్గొన్నారు .అలాగే ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ,చెక్కులను ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు బాల్కసుమన్, జెడ్ పి టి సి సభ్యులు రాజమణి రాజేందర్, ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షులు అయ్యేది రాజేష్ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్, శకళ్ళ గ్రామాలలో సైతం కొప్పుల ఈశ్వర్ చెక్కులు ,పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. గొల్లపల్లి మండలం శ్రీ రాముల పల్లె ,పెగడపల్లి మండలం దీకొండ ,చాగలమర్రి గ్రామాల్లో కూడా గురువారంనాడు చెక్కుల పంపిణీ కార్యక్రమం పూర్తి చేశారు. అలాగే పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక గ్రామంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం కొప్పుల ఈశ్వర్ పూర్తిచేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేన, పెద్దపెల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2018-05-10 at 20.25.09 (4)WhatsApp Image 2018-05-10 at 20.25.09 (1)WhatsApp Image 2018-05-10 at 20.25.09 (2) WhatsApp Image 2018-05-10 at 20.25.09WhatsApp Image 2018-05-10 at 22.41.04 (1)WhatsApp Image 2018-05-10 at 22.41.04 (3)

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *