
విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ ను ఖాళీ చేయాలని ఏపీ సచివాలయ ఉద్యోగులను కోరారు. మూడు విడతలుగా ఏపీ నూతన రాజధాని విజయవాడకు మారాలని.. చాయిస్ మీదే నంటూ స్పష్టం చేశారు. ఈ మేరకు జీఏడీ సర్య్కూలర్ ను జారీ చేశారు. దీంతో ఏపీ సచివాలయ ఉద్యోగుల్లో గందరగోళం నెలకొంది. శాఖల వారీగా కుదరదని.. సచివాలయం మొత్తానికి ఒకే పద్ధతి లో మొత్తంగా మారాలని సూచించారు.
ఒకేసారి విజయవాడకు తరలించడం పై ఏపీ ఉద్యోగులు ఆందోలన వ్యక్తం చేస్తున్నారు. ఉచిత వసతి ఏర్పాటు చేయాలని సచివాలయ ఉద్యోగులు కోరుతున్నారు. కాగా ఏపీ సీఎం చంద్రబాబు ఉద్యోగుల కోసం క్వార్టర్లా, ఇళ్లను ఏర్పాటు చేయాలా అనే దానిపై అంచనాలను రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.