
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినం అయిన జూన్ 2న తెలంగాణ దద్దరిల్లేలా పండుగగా చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారు. మొదటి ఏడాది పాలన పట్టాలెక్కకపోవడంతో మామూలుగా చేశామని.. కానీ ఈసారి పెద్ద ఎత్తున చేయాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు ఘనం గా ఏర్పాట్లు చేయాలని భారీగా నిధులు విడుదల చేస్తామని చెప్పారు.
అమర వీరుల కుటుంబాలకు సన్మానంతో పాటు తెలంగాణ ఉద్యమకారులకు సన్మానం, లక్ష నూట 16తో సన్మానించాలని.. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు స్వీట్లు, మిఠాయిలు, పండ్లు రక్తదాన శిబిరాలు నిర్వహించాలని సూచించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు గాను మంత్రి నాయిని ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. మంత్రులు ఈటెల, కేటీఆర్, జూపల్లి , సాంస్కృతిక సారథి రసమయి అధికారులను ఏర్పాటు చేశారు. వీరు జిల్లా, రాష్ట్రా స్థియిలో అవార్డులు, రివార్డుల అందజేసేందుకు ప్రముఖులను గుర్తించి జూన్ 2 న సన్మానిస్తారు.
ట్యాంక్ బండ్ మీద కేసీఆర్, గవర్నర్, మంత్రులు పాల్గొనే కార్యక్రమంలో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుతారు. హైదరాబాద్ లో విద్యుత్ దీపాలంకరణలతో ముస్తాబు చేస్తారు. మొత్తానికి ఈసారి తెలంగాణ ఆవిర్భావ సంబరాలకు ఓ రేంజ్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.