జూన్ నుంచి కాళోజి వర్సిటీ ప్రారంభం

Kaloji-Narayana-Rao-Health-Sciences-Warangal

చాలా రోజులుగా ఇబ్బందులు పడుతున్న వైద్య విద్యార్థుల కష్టాలు తొందరలోనే తీరనున్నాయి..  ఏపీలోని విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కింద పనిచేస్తున్న తెలంగాణ వైద్య కళశాలలు, పీజీ కళాశాలను ఇక వచ్చే జూన్ నుంచి తెలంగాణలోని కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీనివల్ల ఇన్నాళ్లు సర్టిఫికెట్లు, ఇతర రివ్యూల కోసం విజయవాడకు వెళ్లాల్సిన విద్యార్థుల కష్టాలు తీరాయి.  అన్ని రకాల వైద్యం అయిన యునాని, హోమియోపతి, ఆయుర్వేద, ప్రకృతి వైద్యం తదితర  అన్ని ప్రజారోగ్యంనకు సంబందిధిన పరిశోధన ఫెల్లోషిప్ లన్నీ కూడా ఇక కాళోజి యూనివర్సిటీ పర్యవేక్షిస్తుందని ప్రభుత్వం తెలిపింది. దీనికోసం కాళోజి యూనివర్సిటీకి ప్రభుత్వం కోటి రూపాయలు విడుదల చేసింది. దీంతో పరిపాలన, సిబ్బందిని నియమించుకోవాలని సూచించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *