
కోరుట్ల: తెలంగాణ రాష్ట్ర్రంలో నూతన ప్రభుత్వ జూనియర్ కాలేజీల నిర్మాణం, ఇతర మూలిక వసతుల కల్పనకు 250కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర్ర ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. శుక్రువారం కోరుట్ల నియోజక వర్గంలో 10కోట్లతో మంజూరు అయిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కాలేజిలలో అన్ని వసతులతో పాటు నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తున్నామని తెలిపారు. జూనియర్ కాలేజీలలో విద్యా, సం!! నుండి మధ్యాహ్నభోజనం అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్ధులకు ఉచితంగా పుస్తకాలు పంపిణి చేస్తున్నామని అన్నారు. కాంట్రాక్టు లెక్చరెర్లను రెగ్యులరైజ్ చేస్తున్నామని తెలిపారు. మిగిలిన జూనియర్ లెక్చరర్ పోస్టుల ఖాళీలను రోస్టర్ ప్రకారం భర్తీ చేస్తామని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్ధులు జాతీయ స్ధాయిలో నిట్ ఐ.ఐ.టి కాలేజీలలో ప్రవేశం పొందుతున్నారని అన్నారు. 10వ తరగతి పాసు అయిన వారందరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో చేరేలా ప్రోత్సహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీప్ విప్ కొప్పుల ఈశ్వర్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ, కోరుట్ల శాసన సభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, సబ్ కలెక్టర్ శశాంక్ జెడ్.పి.టి.సి. మున్సిపల్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.