జీహెచ్ఎంసీ ద్వారా గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో 7ల‌క్ష‌ల మొక్క‌లను ఉచితంగా పంపిణీ

బ‌ల్దియా హరిత‌హారం
నాటే ప్ర‌తిమొక్క‌కు జియోట్యాగింగ్‌
నేటి వ‌ర‌కు 7ల‌క్ష‌ల మొక్క‌ల పంపిణీ
హ‌రిత‌హారంలో భాగంగా గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో జీహెచ్ఎంసీ ద్వారా నేటి వ‌ర‌కు 7ల‌క్ష‌ల మొక్క‌లను నాట‌డంతో పాటు ఉచితంగా పంపిణీ చేసింది. ప్ర‌స్తుత హ‌రిత‌హారంలో హైద‌రాబాద్ న‌గ‌రంలో 40ల‌క్ష‌ల మొక్క‌లు నాటాల‌ని జీహెచ్ఎంసీ ల‌క్ష్యంగా నిర్థారించింది. వీటిలో ఐదు ల‌క్ష‌ల మొక్క‌ల‌ను న‌గ‌రంలోని ప్ర‌భుత్వ, జీహెచ్ఎంసీకి చెందిన ఖాళీ స్థ‌లాల్లో జీహెచ్ఎంసీ ద్వారా నాటాల‌న్న ల‌క్ష్యంలో భాగంగా నేటి వ‌ర‌కు 49వేల‌ మొక్క‌లను ఖాళీ స్థ‌లాల్లో నాటారు. పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల‌కు చెందిన విద్యార్థుల‌కు, ప‌లు ప్రార్థ‌న మందిరాలు, ఆల‌యాల వ‌ద్ద ఇళ్ల‌లో పెంచుకునే మొక్క‌లు 6,05,000 మొక్క‌ల‌ను ఉచితంగా పంపిణీ చేశారు. నేడు శ్రీ‌న‌గ‌ర్‌కాల‌నీలోని ఖాళీ స్థ‌లంలో నిర్వ‌హించిన హ‌రిత‌హారంలో జూబ్లీహిల్స్ శాస‌న స‌భ్యులు మాగంటి గోపినాథ్, సెంట్ర‌ల్ జోన్ క‌మిష‌న‌ర్ భార‌తిహోలీకేరి హ‌రిత‌హారంలో పాల్గొనే మొక్క‌లు నాటారు. సీతాఫ‌ల్ మండి వెంక‌టేశ్వ‌రస్వామి దేవాల‌యంలో, మెహిదీప‌ట్నంలోని ర‌వీంద్ర‌భార‌తి పాఠ‌శాల‌లో, రాజేంద్ర‌న‌గ‌ర్ జ‌న‌చైత‌న్య న‌ర్స‌రీలో శేరిలింగంప‌ల్లి జోన్‌లోని చందాన‌గ‌ర్ స‌ర్కిల్‌లో లావేరి హిల్ పార్కులో మొక్క‌లు నాటారు. అదేవిధంగా రాజేంద్ర‌న‌గ‌ర్‌లోని వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యంలో హ‌రిత‌హారాన్ని నిర్వ‌హించి మొక్క‌లు నాటారు.
maganti gopinadh 1
నాటిన ప్ర‌తి మొక్క‌కు జియోట్యాగింగ్‌
హ‌రిత‌హారంలో భాగంగా న‌గ‌రంలో నాటే ప్ర‌తిమొక్కకు, బ్లాక్ ప్లాంటేష‌న్‌కు జియోట్యాగింగ్ చేయ‌నున్న‌ట్టు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి తెలిపారు. హ‌రిత‌హారంలో భాగంగా నాటే మొక్క‌ల‌ను స్ప‌ష్టంగా లెక్కించ‌డం, జ‌వాబుదారిగా ఉండేందుకుగాను జియోట్యాగింగ్ చేప‌డుతున్నామ‌ని తెలిపారు. న‌గ‌రంలో జీహెచ్ఎంసీ నిర్వ‌హిస్తున్న న‌ర్స‌రీల వివ‌రాలు అందులో అందుబాటులో ఉన్న మొక్క‌లు, అధికారుల ఫోన్ నెంబ‌ర్ల వివ‌రాల‌ను జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌లో ఉంచామ‌ని తెలిపారు.
haritha haram     haritha haram 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *