Breaking News

జీహెచ్ఎంసీ ఎన్నికలకు రంగం సిద్ధం

51449855551_625x300

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు అధికారులను బుధవారం కేటాయించింది.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగే ఎన్నికల పర్యవేక్షణకు మొత్తం 30 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం నియమించింది. అలాగే మరో 26 మంది అడిటింగ్ అధికారులను కూడా ప్రభుత్వం నియమించిందని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి తెలిపారు..

కాగా జీహెచ్ఎంసీకి జనవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెలాఖరులో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేస్తారని సమాచారం. ఇందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం ఇక షెడ్యూలు ప్రకటించడమే తరువాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *