జీతాల కోసం పోరాటమే..

salaru

ఎంత వత్యాసం.. వాళ్లు ఉద్యోగులే.. వీళ్లు ఉద్యోగులే.. ప్రజలకు సేవ చేసే వారే.. కానీ హోదాలు.. పని మాత్రమే వేరు.. జీతాలు మాత్రం నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా.. శ్రమ దోపిడీ యాజమాన్యాల కబంధ హస్తాల్లో బడుగు కార్మికులు నలిగిపోతూనే ఉన్నారు. సమ్మెలు చేస్తూ కొందరు.. పూట గడవక మరికొందరు ఉద్యోగాల కోసం కొట్లాడుతూనే ఉన్నారు. కానీ నిరంకుశ యాజమాన్యాల వల్ల కార్మికులు, సగటు జీతగాళ్ల బతుకు నరకంగానే మారుతోంది.

సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు

సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు

ఆర్టీసీ కార్మికులు తమకూ 43శాతం ఫిటెమెంట్ ఇవ్వాలని రెండు తెలుగు రాష్ట్రాల్లో సమ్మె మొదలుపెట్టారు. ఈ సమ్మెను విచ్చిన్నం  చేసేందుకు ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లను తీసుకొచ్చి సమ్మె విచ్చిన్నానికి ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నిస్తూనే ఉంది. కొందరు కడుపు తిప్పలు..మరికొందరు జీతాల తిప్పలు..

పూట గడవని కార్మికులు సమ్మె చేయడంలో ఎంత నిజాయితీ ఉందో.. ప్రభుత్వాలు, యాజమాన్యాలు కార్మికులను శ్రమ దోపిడీ చేయడంలో అంతే కఠినత్వం ప్రదర్శిస్తున్నాయి. వేలు వందల్లోనే ఇంకా ఆర్టీసీ కార్మికుల జీతాలుండగా.. అదే ప్రభుత్వ ఉద్యోగులకు 40వేలకు పైగానే ఉంది. చేసే పని ఒక్కటే.. కానీ జీతాల స్థాయే వేరు..

ఎవరిది న్యాయం.. అన్యాయం కాదు.. టైంకు జీతిలిచ్చి సంవత్సరానికి  ఒకసారి జీతాలు పెంచే సంస్కృతి అన్ని యాజమాన్యాలు పాటించాలి. కానీ పైకి ఏ ఒక్కరూ పాటించిన దాఖలాలు లేవు. . పూట గడవని బక్కజనం పనిచేస్తూనే ఉంటారు.. యాజమాన్యాలు వారి అవకాశాన్ని ఆసరా చేసుకుని దోచుకుంటేనే ఉంటాయి.. రోజులు మారే రోజు కోసం ఎదరుచూడడం తప్ప ఆర్టీసీ కార్మికులు చేయగలిగింది ఏదీ లేదు.. వారికి మంచి రోజులు రావాలి.. స్వతంత్రంగా జీవించాలని ఆశిద్దాం.. అప్పుడే యాజమాన్యాల తిక్క కుదిరుతుంది.. దీనికి కావాల్సిందల్లా విస్తృత ఉపాధి.. మరో రెండేళ్లలో అయినా అది మారుతుందని అనుకుందాం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *