
సీవీఆర్ న్యూస్ చానల్ ఉద్యోగులు జీతాల కోసం ఆందోళన బాట పట్టారు. మూడు నెలలుగా యాజమాన్యం జీతాలు ఇవ్వక పనిచేయించుకుంటుండడంతో విధుల ఎగ్గొట్టి కార్యాలయంలో నిరసన తెలిపారు. అనంతరం అందరూ కలిసి ప్రెస్ అకాడమీ చైర్మన్ కు వినతి పత్రం అందించారు. దాదాపు 50 మంది సీనియర్ జర్నలిస్టులు, ఉద్యోగులు, సబ్ ఎడిటర్లు అల్లం నారాయణను కలిసి తమకు జీతాలిప్పించాలని వేడుకున్నారు.
సంస్థ చైర్మన్ సీవీ రావు జీతాలివ్వాలని కోరితే బెదిరిస్తున్నాడని.. ఉద్యోగాల నుంచి చాలా మందిని తొలగించాడని.. పూట గడవక తమను ఆశ్రయించామని తెలిపారు.
కాగా సీవీఆర్ న్యూస్ సిబ్బంది మొత్తం ఆందోళన చేయడంతో డెస్క్ లో స్తంభించింది. ఇన్ పుట్, అవుట్ ఎడిటర్లు తమ హోదాను మరిచి స్క్రోలింగ్ కొట్టారు. ఇంత జరుగుతున్నా యాజమాన్యం ఉద్యోగుల జీతాలపై స్పందించలేదు..